Hyderabad, ఫిబ్రవరి 18 -- OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీ పెట్టింది పేరు. అందులో నెట్‌ఫ్లిక్స్ లో ఇలాంటివే ఎక్కువ. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ లోకే డబ్బా కార్టెల్ (Dabba Cartel) పేరుతో మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజ్ కాగా.. వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నటీనటులు షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, గజరాజ్ రావ్ లాంటి వాళ్లు నటించిన సిరీస్ ఇది. డబ్బాల్లో లంచ్ తోపాటు డ్రగ్స్ కూడా సప్లై చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ వాళ్ల అక్రమ దందా, అందులో ఇరుక్కుపోయి అటు డ్రగ్స్ మాఫియా, ఇటు పోలీసుల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్య...