Hyderabad, జనవరి 31 -- OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు కేరాఫ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లోకి డబ్బా కార్టెల్ (Dabba Cartel) అనే మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ రానుంది. నాలుగు డబ్బులు సంపాదించడానికి లంచ్ సప్లై చేసే ఐదుగురు మహిళలు అనుకోకుండా ఓ డ్రగ్స్ రాకెట్ బారిన పడితే ఎలా ఉంటుందన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ కాగా.. ఫిబ్రవరి 28 నుంచి డబ్బా కార్టెల్ స్ట్రీమింగ్ కానుంది.

బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్. ఆమెతోపాటు మరో సీనియర్ నటి జ్యోతిక, షాలిని పాండేలాంటి వాళ్లు కూడా ఇందులో నటిస్తున్నారు.

ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా.. శుక్రవారం (జనవరి 31) టీజర్ రిలీజ్ చేశారు. హితేష్ భాటియా డైరెక్ట్...