Hyderabad, ఏప్రిల్ 14 -- OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ ప్రేమ జంట.. అనుకోని పరిస్థితుల్లో జరిగే హత్యల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో సిరీస్ పై అంచనాలు పెరిగాయి.

సోనీ లివ్ ఓటీటీలోకి బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే సరికొత్త వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ మే 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సోమవారం (ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేశారు.

"అన్ని ప్రేమ కథలూ చరిత్ర సృష్టించలేవు. కొన్ని క్రైమ్ రిపోర్టులుగా మారతాయి. నాలుగు శవాలు.. లెక్కలేనన్ని అబద్ధాలు. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ మే 2 నుంచి కేవలం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ వచ్చేసింది" అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ఓటీటీ ట్వీట్ చేసింది. దీనికి ట్రైలర్ వ...