భారతదేశం, ఆగస్టు 3 -- దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో సుమారు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‍గా వెలుగొందుతున్నారు త్రిష. ఇప్పటికీ వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఓటీటీ ప్రాజెక్టులోకి త్రిష అడుగుపెట్టారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ 'బృంద' ఆగస్టు 2వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. త్రిష చేసిన ఫస్ట్ సిరీస్ కావడంతో ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ వెబ్ సిరీస్‍కు పాజిటివ్ టాక్ వస్తోంది. త్రిష ఓటీటీ ఎంట్రీ సక్సెస్ అయింది. వివరాలివే..

క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన బృంద వెబ్ సిరీస్ ఆగస్టు 2న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సిరీస్‍కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు.

బృంద సిరీస్‍ను సోనీలివ్ ఓట...