భారతదేశం, ఫిబ్రవరి 19 -- హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్ర పోషించిన 'సుడల్: ది వర్టెక్స్' వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. 2022 జూన్‍లో వచ్చిన ఈ సిరీస్ భారీ వ్యూస్ సాధించింది. సూపర్ సక్సెస్ అయింది. దర్శకులు పుష్కర్ - గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్‍కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సుమారు మూడేళ్లకు సుడల్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది. ఈ సుడల్ సీజన్ 2 ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 19) రివీల్ అయింది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

తన చెల్లిని హత్య చేసిన వ్యక్తిని చంపిన నందిని (ఐశ్వర్య రాజేశ్) జైలు పాలైన షాట్‍తో సుడల్: ది వర్టెక్స్ సీజన్ 2 ట్రైలర్ మొదలైంది. తన చెల్లిని చంపినందుకే ప్రతీకారం తీర్చుకున్నాననే డైలాగ్ ఉంటుంది. నందినిని బయటికి తీసుకొచ్చేందుకు ఆమె ఫ్రెండ్, ఎస్ఐ చక్రవర్తి (ఖాతిర్) ప్రయత్నిస్తుంటాడు. నందిని తరఫున సీనియర్ లాయర్ చెల్లప్ప (ల...