Hyderabad, మార్చి 7 -- OTT Crime Thriller Movie: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కు ఓటీటీలో ఫుల్ డిమాండ్. అందులోనూ కొరియన్ కంటెంట్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ రెండింటి కాంబినేషన్ లో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు హిట్ మ్యాన్ (Hit Man).

హిట్ మ్యాన్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఇండియన్ ఓటీటీలోకి వస్తోంది. లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో మార్చి 28 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

సమాజంలోని అవినీతి, జాతి వివక్ష, వ్యవస్థీకృత నేరాలు, అన్యాయం, అసమానతలాంటి అంశాలను అందరూ మెచ్చేలా తీయడంతో కొరియన్ ఫిల్మ్ మేకర్స్ అందరి కంటే ముందుంటారు. అలా వచ్చిందే ఈ హిట్ మ్యాన్ మూవీ కూడా. సుమారు రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ ద్వారా భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

హిట్ మ్యాన్ నవంబర్, 2022...