Hyderabad, జనవరి 27 -- OTT Comedy Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ కు ఓటీటీ మంచి అడ్డా. అందులోనూ నెట్‌ఫ్లిక్స్ అంటే చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఓటీటీలోకి ఇప్పుడో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ నేరుగా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మూవీ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా స్ట్రీమింగ్ కానుండగా.. సోమవారం (జనవరి 27) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్ లోకి నేరుగా రాబోతున్న ఈ మూవీ పేరు ధూమ్ ధామ్ (Dhoom Dhaam). బాలీవుడ్ తోపాటు పలు టాలీవుడ్ సినిమాల్లో నటించిన యామీ గౌతమ్, స్కామ్ 1992 వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించిన ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. రిషబ్ సేఠ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఆదిత్య ధర్, లోకేష్ ధర్ నిర్మించారు.

అప్పుడే పెళ్లి చేసుకొని శోభనం రాత్రి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ఓ జంట కొందరు గ్యాం...