భారతదేశం, జనవరి 30 -- ఓటీటీలో ఈ రోజు (జనవరి 30) కొత్త సినిమాలు, కొత్త సిరీస్ ల జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అదిరిపోయే సస్పెన్స్, ట్విస్ట్ లతో ఓ కొత్త వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరెక్కిన ఈ సిరీస్ పేరు దల్‌దల్. ఇందులో భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించింది. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ గా నటించింది.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ రకం సినిమాలు, సిరీస్ లను ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు శుక్రవారం ఓటీటీలోకి వచ్చిన దల్‌దల్ వెబ్ సిరీస్ కూడా అలాంటిదే. ఇది సస్పెన్స్, ట్విస్ట్ లతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది రిలీజైంది. ఓటీటీలో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది.

వెబ్ సిరీస్ పేరు దల్‌దల్. ఇది డిఫరెంట్ గా ఉంది. దీని అ...