Hyderabad, మార్చి 27 -- Adolescence OTT Release And Trending: ఓటీటీలో ఎన్నో విధాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కుతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మైల్డ్ స్టోన్‌లా అలా గుర్తుండిపోతాయి. ఇక వాటికి వరల్డ్ వైడ్‌గా విపరీతమైన క్రేజ్ వస్తుంటుంది. ఇప్పుడు కూడా అంతటి రేంజ్‌లో వైరల్ అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్ మినీ వెబ్ సిరీస్ అడోలసెన్స్.

బ్రిటీష్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన అడోలసెన్స్ అంటే యుక్త వయసు లేదా కౌమారదశ అనే అర్థం వస్తుంది. స్టీఫెన్ గ్రాహం కథ అందించి, నటించిన ఈ మినీ సిరీస్‌కు ఫిలిప్ బరంతిని దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ఓవెన్ కూపర్, స్టీఫెన్ గ్రాహం, ఎరిన్ డొహెర్టీ, అష్లీ వాల్టర్స్, ఫయె మార్సే, క్రిస్టిన్ ట్రేమార్కో ఇతరులు కీలక పాత్రలు పోషించారు.

అడోలసెన్స్ ఒక 13 ఏళ్ల జేమీ మిల్లర్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. తన గర్ల్ క్...