భారతదేశం, మార్చి 22 -- మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ సత్తాచాటుటోంది. కుంచబో బోబన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బంపర్ హిట్ అయింది. తెలుగులోనూ మార్చి 14న విడుదలైంది. ట్విస్టులు, గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా అదిరే రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా ఈ శుక్రవారం (మార్చి 21) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఎంగేజింగ్‍గా, ఆసక్త...