Hyderabad, ఏప్రిల్ 18 -- Highway Telugu Movie OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చి అలరిస్తుంటాయి. ఒక్కోటి ఒక్కో రకం జోనర్‌తో వచ్చిన పలు ఎలిమెంట్స్ యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. ఇక హారర్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ వంటి జోనర్ మూవీస్‌ను ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

అలా నేరుగా ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉంది. అదే హైవే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ఓటీటీ సినిమానే హైవే. దొరసాని సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ హిట్ కంటే ముందుగా ఓటీటీ సినిమాలు, సిరీస్‌లు చేశాడు.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సిరీస్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన ఓటీటీ సినిమా హైవే. 2022లో డైరెక్ట్‌గా హైవే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు మిస్టర...