Hyderabad, మార్చి 20 -- Touch Me Not OTT Release: ఓటీటీలోకి ఎన్నో వైవిధ్యభరిత సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు, సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ జోనర్స్‌తోపాటు హరర్ సినిమాలు సైతం అలరిస్తున్నాయి.

ఇలా ఇప్పుడు తెలుగులో సరికొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అదే టచ్ మీ నాట్. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్‌లో హీరో నవదీప్‌తోపాటు దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌కు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఇది వరకు ఆయన నాగ శౌర్యతో అశ్వత్థామ వంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు.

సునీత తాటి గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన టచ్ మీ నాట్ వెబ్ సిరీస్‌...