భారతదేశం, మార్చి 1 -- క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్: ది వర్టెక్స్‌కు రెండో సీజన్ వచ్చేసింది. ఎంతో మంది ఎదురుచూసిన సుడల్ 2 అడుగుపెట్టేసింది. అంచనా వేసినట్టుగా ఈ రెండో సీజన్ దుమ్మురేపుతోంది. సుడల్ 2 సిరీస్‍లో కాథిర్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. పుష్కర్ - గాయత్రి ఈ సిరీస్ క్రియేటర్లుగా ఉన్నారు. శుక్రవారమే (ఫిబ్రవరి 28) స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ రెండో సీజన్ అప్పుడే ఓటీటీ ట్రెండింగ్‍లో దూసుకెళుతోంది.

సుడల్ సీజన్ 2ను ఎంతో హైప్ మధ్య అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఫిబ్రవరి 28న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీజన్ కోసం నిరీక్షిస్తున్న ఎంతో మంది చూసేశారు. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన ఒక్క రోజులోనే సుడల్ రెండో సీజన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో టాప్‍ ప్లేస్‍కు దూసుకొచ్చింది. భారీ వ్యూస్‍తో ఈ సిరీస్ అదరగొడుతోంది.

సుడల్...