Hyderabad, మార్చి 17 -- OTT Crime Show: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, సినిమాలే కాదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకప్పటి పాపులర్ క్రైమ్ షోలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మధ్యే సోనీ ఛానెల్ హిట్ షో సీఐడీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మరో క్రైమ్ షో కూడా అదే రూట్లో వెళ్లింది.

క్రైమ్ ప్యాట్రోల్ (Crime Patrol) పేరు వినే ఉంటారు. ఒకప్పుడు టీవీల్లో ఓ ఊపు ఊపేసిన క్రైమ్ షో. ఇప్పుడీ షో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. సీఐడీ రూట్లోనే ఈ షో కూడా అదే ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. నిజానికి ఇప్పటికే ఈ షో సోనీ లివ్ ఓటీటీలోనూ ఉంది.

ఆ ఓటీటీకి చెందిన ఛానెల్ సోనీ నెట్‌వర్క్ లో ఒకప్పుడు మంచి పేరు సంపాదించిన షో ఇది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ వచ్చింది. సోమవారం (మార్చి 17) నుంచే ఈ రెండో ఓటీటీలోకీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

అనూప్ సోనీ నటించిన...