Hyderabad, జనవరి 30 -- OTT Crime Drama Web Series: ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ లో ఒకటి ఆశ్రమ్ (Ashram). ఈ మధ్యే డాకు మహారాజ్ మూవీలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాబీ డియోల్ నెగటివ్ రోల్లో, ఓ దొంగ బాబాగా నటించిన సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ కూడా రాబోతుండగా.. గురువారం (జనవరి 30) ఎంఎక్స్ ప్లేయర్ టీజర్ రిలీజ్ చేసింది.

ప్రముఖ ఫ్రీ ఓటీటీల్లో ఒకటైన ఎంఎక్స్ ప్లేయర్ లో ఇప్పటికే మూడు సీజన్ల పాటు వచ్చిన వెబ్ సిరీస్ ఆశ్రమ్. ఈ మధ్యే అమెజాన్ కొనుగోలు చేసిన ఈ ఎంఎక్స్ ప్లేయర్ లో ఆ ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ కూడా త్వరలోనే రాబోతోంది.

తాజాగా ఓ టీజర్ ద్వారా ఎంఎక్స్ ప్లేయర్ ఈ విషయాన్ని వెల్లడించింది. బాబా నిరాళా అనే ఓ దొంగ బాబా పాత్రలో బాబీ డియోల్ జీవించేసిన బో...