భారతదేశం, జనవరి 24 -- స్టార్ హీరోలు అదిరిపోయే యాక్షన్ చేయడం చూసే ఉంటాం. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, భావోద్వేగాల కలయిక మనల్ని టీవీ స్క్రీన్లకు హత్తుకుపోయేలా చేస్తాయి.

అయితే, నలుగురు సాధారణ మహిళలు బతకడం కోసం మరి వయోలెంట్ యాక్షన్‌లోకి దిగితే. అలాంటి యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నిన్న (జనవరి 23) ఓటీటీలోకి వచ్చేసింది. ఆ వెబ్ సిరీసే కాళీపోట్కా (Kaalipotka).

బెంగాలీలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సిరీస్ కాళీపోట్కా. కాళీమాతకు పూజ చేసే సమయంలో పేల్చే ఒక చిన్న టపాసును కాళీపోట్కా అంటారని తెలుస్తోంది. కాళీపోట్కా సిరీస్‌లో ప్రముఖ బెంగాలీ నటి స్వాస్తిక ముఖర్జీ, శ్రుతి దాస్, శ్రేయా భట్టచార్య, హిమికా బోస్ ప్రధాన పాత్రలు పోషించారు.

వీరితోపాటు అనిర్బన్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఒక్క శవంతో నలుగురి మహిళల జీవితాలు ...