Hyderabad, జనవరి 27 -- OTT Comedy Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ తెలుగు మూవీ రానుంది. తెలుగులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఆర్పీ పట్నాయక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పేరు కాఫీ విత్ ఎ కిల్లర్. ఇదొక కామెడీ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ఎప్పుడో రెండేళ్ల కిందటే థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి ఇన్నాళ్లకు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీ, స్టోరీ, ఇతర విశేషాలేంటో తెలుసుకోండి.

కాఫీ విత్ ఎ కిల్లర్ (Coffee With a killer) మూవీ ఎప్పుడో 2022లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అదే ఏడాది సెప్టెంబర్ లో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ లాంచ్ చేశాడు. అయితే అసలు ఈ పేరుతో ఓ మూవీ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. మొత్తానికి ఇప్పుడీ సినిమాను వచ్చే శుక్రవారం (జనవరి 31) నుంచి ఆహా వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.

ఈ విషయాన...