భారతదేశం, ఫిబ్రవరి 28 -- స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా శ్రీకాకుళం షెర్లాక్‍హోమ్స్ చిత్రం వచ్చింది. ఈ డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం గతేడాది డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ట్రైలర్‌తోనే ఈ సినిమా క్యూరియాసిటీని పెంచింది. అయితే, మోస్తరు టాక్ వచ్చినా ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా ఇప్పటికే రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓ ఓటీటీలో ఈ మూవీ హిందీ వెర్షన్ దుమ్మురేపుతోంది.

శ్రీకాకుళం షెర్లాక్‍హోమ్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు పాటు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‍కు ఉంది. ముందు తెలుగులో రాగా.. ఆ తర్వాత మిగిలిన రెండు భాషల్లో అడుగుపెట్టంది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీకి తెలుగుకు మించి హిందీ వెర్షన్‍కు భారీ వ్యూస్ దక్కుతున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో ఎక్...