భారతదేశం, మార్చి 4 -- మజాకా సినిమా రిలీజ్‍కు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. ఎంటర్‌టైనింగ్‍గా ఉన్న ట్రైలర్‌తో అంచనాలను ఎక్కువగా క్రియేట్ చేసింది. అయితే, సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో ఆశించిన రేంజ్‍లో కలెక్షన్లను రాబట్టలేకపోతోంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా నచ్చినా ఎవరూ వేరే వాళ్లకు చెప్పడం లేదంటూ డైరెక్టర్ నక్కిన త్రినాథరావే అన్నారు. కలెక్షన్లు సరిగా రావడం లేదనేలా మాట్లాడారు. ఈ క్రమంలో మజాకా చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍పై తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

మజాకా చిత్రం థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‍పై బజ్ నడుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తీసుకువాలని మేకర్స్ అనుకున్నారు. కా...