Hyderabad, మార్చి 7 -- OTT Comedy Movie: ఓటీటీలోకి మలయాళం సినిమాలు వరుస కడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో రిలీజైన మూవీస్ ఇప్పుడు మెల్లగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్నాయి. అలా ఒరు జాతి జాతకం (ఓ విచిత్రమైన జాతకం) అనే కామెడీ మూవీ కూడా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు వినీత్ శ్రీనివాసన్ నటించిన సినిమా ఇది.

ఒరు జాతి జాతకం అనే మూవీ ఈ ఏడాది జనవరి 31న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను మనోరమ మ్యాక్స్ సొంతం చేసుకున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా వస్తుండటం విశేషం. మార్చి 14 నుంచి సినిమాను ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయనుంది.

అయితే ఈ ప్లాట్‌ఫామ్ లోని చాలా వరకు మలయాళం సినిమాలు తెలుగులాంటి ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ ఒరు జాతి జాతకం సినిమా మాత్రం కేవలం మలయాళంలోనే రానుంది. ఇ...