భారతదేశం, మార్చి 9 -- లవ్‍టుడే ఫేమ్, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో ఈ తమిళ కామెడీ డ్రామా మూవీ వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ టాక్‍తో అదరగొడుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటూ బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍పై తాజాగా రూమర్లు వచ్చాయి.

డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీని మార్చి 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా సమాచారం వెల్లడైంది.

డ్రాగన్ మూవీని ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 21నే తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ అనుకుందన...