భారతదేశం, మార్చి 11 -- టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ నటించిన లైలా చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. విశ్వక్ లేడీ గెటప్, ట్రైలర్, బాయ్‍కాట్ వివాదం.. ఈ అంశాలు ఈ మూవీకి బజ్ విపరీతంగా తెచ్చిపెట్టాయి. అయితే, రిలీజ్ తర్వాత ఈ చిత్రానికి పూర్తిగా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రీసెంట్‍గానే లైలా సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, నేడు (మార్చి 11) మరో భాషలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.

లైలా సినిమా తెలుగులో మార్చి 9న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కానీ పెద్దగా వ్యూస్ దక్కడం లేదు. ఈ తరుణంలో నేడు ఈ చిత్రం తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. లైలా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది...