Hyderabad, ఫిబ్రవరి 2 -- Anukunnavanni Jaragavu Konni OTT Release: ఓటీటీలోకి వివిధ రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ప్రతి వారం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూనే ఉన్నాయి. వీటిలో తెలుగు నుంచి కూడా ఎన్నో రకాల జోనర్స్‌లో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే, క్రైమ్, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ జోనర్స్ సినిమాలను సాధారణంగా ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే ఇలాంటి జోనర్స్‌లో ఎక్కువగా సినిమాలు వస్తుంటాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదల అయిన తెలుగు క్రైమ్ కామెడీ సినిమానే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. కామెడీకి క్రైమ్ ఎలిమెంట్స్‌తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

అనుకున్నవన్నీ జరగవు కొన్ని సినిమాలో శ్రీరామ...