Hyderabad, మార్చి 6 -- OTT Telugu Movies With Mind Blowing Climax Scene: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు అలరిస్తుంటాయి. అయితే, థ్రిల్లర్ సినిమాలు ఊహించని ట్విస్టులు, మలుపులతో సాగుతుంటాయి. మరి అలా మైండ్ బెండ్ అయ్యేలా ఊహించని క్లైమాక్స్ సీన్‌తో ఉన్న టాప్ 5 ఓటీటీ తెలుగు థ్రిల్లర్ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ నటించిన బోల్డ్, క్రైమ్ థ్రిల్లర్ మూవీ మంగళవారం. ఈ సినిమాలో అప్పటివరకు అందరిని దెయ్యమో, ఇంకేదో చంపుతుందని అనుకుంటారు. కానీ, ఆర్ఎంపీ డాక్టర్ విశ్వనాథమే చంపుతున్నాడనే క్లైమాక్స్ సీన్ దిమ్మతిరుగుతుంది. అలాగే, రాజేశ్వరి దేవి పాత్రలో వచ్చి ట్విస్ట్ మాత్రం ఎవరు ఏమాత్రం ఊహించి ఉండరు. అయితే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మంగళవారం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

అదిరిపోయే హారర్ సీక్వెన్స్‌తో తెలుగు ప్రేక్షకులను మన...