Hyderabad, ఫిబ్రవరి 7 -- OTT Bold Web Series: శ్వేతా బసు ప్రసాద్ తెలుసు కదా. ఒకప్పుడు కొత్త బంగారు లోకం మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ నటి తర్వాత ఓటీటీలో పలు బోల్డ్ క్యారెక్టర్లు చేసింది. ఇప్పుడు అలాంటిదే మరో బోల్డ్ క్యారెక్టర్ తో ఊప్స్ అబ్ క్యా (Oops Ab Kya) అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కాగా.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

శ్వేతా బసు ప్రసాద్ నటించిన వెబ్ సిరీస్ ఊప్స్ అబ్ క్యా. టైటిల్ కు తగినట్లే ఈ సిరీస్ కూడా కాస్త బోల్డ్ కంటెంట్ తోనే రాబోతోంది. ఇందులో ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నా.. అనుకోకుండా తన బాస్ వీర్యంతోనే తల్లి కాబోయే అమ్మాయి పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ నటించింది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫిబ్రవరి 20 నుంచి హాట్‌స్టార్ లో ఈ వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లు స్ట్రీ...