భారతదేశం, జనవరి 23 -- ఓటీటీ సినిమాలు అనగానే అన్ని రకాల జోనర్స్‌తో అలరిస్తుంటాయి. ఇక తెలుగులో వచ్చే డిఫరెంట్ జోనర్స్ మూవీస్ ఓటీటీ ప్రియులను ఊరిస్తుంటాయి. అయితే, ఇటీవల కాలంలో తెలుగులో అన్ని రకాల జోనర్ మూవీస్ వచ్చినప్పటికీ బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలు తక్కువగా అయ్యాయి.

కానీ, గతేడాది థియేటర్లలో ఓ తెలుగు బోల్డ్ మూవీ సందడి చేసింది. కానీ, అనుకున్నంత క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆ సినిమానే మారియో. 90స్ కిడ్స్‌కు సూపర్ మారియో గేమ్ ఎంత ఇష్టమో తెలిసిందే. అదే టైటిల్‌తో తెలుగులో బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా మారియో తెరకెక్కింది.

మారియో సినిమాలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్‌గా చేసింది. అంతేకాకుండా రియల్ లైఫ్ హీరోయిన్‌గా హెబ్బా పటేల్ పేరుతోనే మారియో సినిమాలో యాక్ట్ చేసింది ఈ బ్యూటి. అలాగే, ఈ సినిమాలో ప్రముఖ డైలాగ్...