Hyderabad, ఏప్రిల్ 14 -- OTT Bold Tamil Movie: లెస్బియన్ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ మన సమాజం వింతగానే చూస్తుంది. అది చట్ట వ్యతిరేకం కాదన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దీనిని అంగీకరించే వాళ్లు తక్కువే. అలాంటి బోల్డ్ కాన్సెప్ట్ పై ఈ మధ్య తరచూ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తూనే ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడో తమిళ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన మూవీ కాదల్ ఎన్‌బదు పోదు ఉదమై. అంటే ప్రేమ ఓ పబ్లిక్ ప్రాపర్టీ అని అర్థం. ఈ సినిమాను ఇప్పుడు సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది. సోమవారం (ఏప్రిల్ 14) నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన సరిగ్గా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఈ విషయాన్ని సన్ నెక్ట్స్ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "అడ్డంకులను అధిగమ...