Hyderabad, మార్చి 1 -- Rajkahini OTT Release On 3 Platforms: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి భాషా భేదం లేకుండా ఇతర భాషల్లోని సినిమాలను ఓటీటీ ఆడియెన్స్ చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక ఓటీటీలో హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్స్‌ను ఎక్కువగా ఇష్టపడేవారుంటారు.

అయితే, కంటెంట్ ఫ్రెష్‌గా ఉంటే ఎలాంటి జోనర్ సినిమాలను అయినా ప్రేక్షకులు చూస్తారు. అలాంటి డిఫరెంట్ అండ్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో 2015లో విడుదలైన సినిమానే రాజ్‌కహిని. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. విమర్శకులు సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు. దాంతో రాజ్‌కహిని హిట్‌గా నిలిచింది.

రాజ్‌కహిని సినిమా భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే సమయంలో సాగుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఒక సరిహద్దు గీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశిస్తుంది. అయితే, ఆ...