Hyderabad, మార్చి 15 -- Joyland OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు దర్శనం ఇస్తుంటాయి. అయితే, ఓటీటీ ఆడియెన్స్‌ ఎక్కువ మెచ్చే చిత్రాల్లో హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్సే ఉంటాయి. కానీ, టేకింగ్, స్క్రీన్ ప్లే, ఆలోచించేలా సినిమాలు తెరకెక్కిస్తే అవి మంచి ఆదరణ పొందుతాయి. అలాంటి సినిమాల్లో ఒకటే జాయ్‌ల్యాండ్.

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన జాయ్‌ల్యాండ్ ఒక పాకిస్తానీ సినిమా. దీనికి సైమ్ సాదిక్ దర్శకత్వం వహించారు. ఇదే ఆయనకు దర్శకుడిగా డెబ్యూ మూవీ. అపూర్వ గురు చరణ్, సమద్ సుల్తాన్ ఖూసత్, సబిహ సుమర్, లారెన్ మన్ నిర్మాతలుగా వ్యవహరించిన జాయ్‌ల్యాండ్‌ మూవీకి పాకిస్తాన్ ఎడ్యుకేషనల్ యాక్టివస్ట్ మలాలా యూసఫ్‌జాయ్ ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉండటం విశేషం.

అటు గ్రాఫిక్స్ కాకుండా, ఇటు పోర్నోగఫీ లేకుండా న్యూడిటీ, అడల్ట్, సెక్సువల్ కంటెంట్‌తో చిత్...