Hyderabad, మార్చి 13 -- Soojidaara OTT Release: ఓటీటీలోకి అనేక రకాల కంటెంట్‌తో ఎన్నో సినిమాలు అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఓటీటీ ఆడియెన్స్‌ను హారర్, కామెడీ, బోల్డ్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ వంటి జోనర్స్ సినిమాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. అందుకే భాషా భేదం లేకుండా ఇతర ఇండస్ట్రీ చిత్రాలను సైతం అందరూ వీక్షిస్తున్నారు.

అలా ఓటీటీలో మంచి ఆదరణ పొందిన సినిమాల్లో ఒకటే సూజిదార. 2019 మే 10న థియేటర్లలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా విడుదలైన సూజిదార మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుంది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందింది. సూజిదార ఒక కన్నడ చిత్రం. సూజిదార అంటే తెలుగులో సూది, దారం అని అర్థం వస్తుంది. అంటే, దీన్ని ఎక్కువగా కుట్టు మిషన్‌లో వాడుతారు.

అలాగే, సూజిదార సినిమాలో ప్రధాన పాత్రల్లో ఒకటైన పద్మశ్రీ కూడా కుట్టు మిషన్ కుడుతుంటుంది. ఆ...