భారతదేశం, ఏప్రిల్ 20 -- నికోల్ కిడ్‍మన్, హారిస్ డికిన్‍సన్ ప్రధాన పాత్రలు పోషించిన బేబీగర్ల్ చిత్రం బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది. ఈ బోల్డ్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి హలీనా రెజిన్ దర్శకత్వం వహించారు. ఈ బేబీగర్ల్ సినిమా ఇప్పుడు ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

బేబీగర్ల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇప్పుడు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు నాలుగు నెలలకు ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

బేబీగర్ల్ సినిమాలో నికోల్, హారిస్‍తో పాటు ఆంటోనీ బాండెరస్, సోఫీ వైల్డ్, ఎస్తేర్ మెక్‍గ్రెగోర్, వాన్ రీలీ, విక్టర్ స్లెజాక్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్...