Hyderabad, మార్చి 28 -- OTT Movies Web Series On Women Centric: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. వివిధ జోనర్లలో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తుంటాయి. అయితే, మహిళలను ఆధారంగా చేసుకుని స్ఫూర్తివంతమైన, వుమెన్ ఒరియెంటెడ్ సినిమాలు, సిరీస్‌లు సైతం ఎన్నో వచ్చాయి. మరి 2024, 2025లో వచ్చిన మహిళ ఆధారిత ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దాం.

ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చిన బోల్డ్ అండ్ రొమాంటిక్ మూవీ గర్ల్స్ విల్ బీ గర్ల్స్. రీసెంట్‌గా ఈ సినిమాకు ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది. అలాగే, ఇందులో నటించిన కని కుశ్రుతికి బహుముఖ ప్రజ్ఞశాలి అవార్డ్ వరించింది.

16 ఏళ్ల కూతురికి కౌమార దశలో వచ్చి సెక్సువల్ ఫీలింగ్స్‌ ఆమె చదువులకు ఆటంకం కలగకూడదని పరితపించే తల్లి చుట్టూ ఈ స...