Hyderabad, మార్చి 12 -- OTT Biopic: ఓటీటీలోకి ఇప్పుడో తెలుగు బయోపిక్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టినా.. ఇప్పుడు కూడా రెంట్ విధానంలోనే ఈ మూవీని చూసే అవకాశం కల్పించడం గమనార్హం. అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.

అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు మన్యం ధీరుడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే సబ్‌స్క్రైబర్లందరికీ కాకుండా రూ.99 రెంట్ చెల్లించిన వారికి మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం కల్పించారు.

ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. థియేటర్లలో రిలీజైన ఆరు నెలలకు ఓటీటీలోకి వచ్చినా, అది కూడా పెద్దగా సక్సెస్ కాని మూవీకి ఓటీటీలో రెంట్ విధానంలో అందుబాటులోకి తేవడం చాలా అరుదు.

మన్యం ధీరుడు మూవీని నరే...