Hyderabad, మార్చి 15 -- Manyam Dheerudu Seetharama Raju OTT Release: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ తెలుగు బయోగ్రాఫికల్ మూవీ మన్యం ధీరుడు. అల్లూరి సీతారామరాజు అనేది క్యాప్షన్. ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మన్యం ధీరుడు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందుకే తాజాగా మన్యం ధీరుడు ఓటీటీ సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.

విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మన్యం ధీరుడు సక్సెస్ మీట్‌కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్‌వీవీ మూవీస్ బ్యానర్‌పై ఆర్‌వీవీ సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన మన్యం ధీరుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు.

ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథ...