భారతదేశం, ఏప్రిల్ 22 -- యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. సరదాగా ఉండటంతో పాటు పాత్రలు బొమ్మల్లా కనిపించడం వల్ల వల్ల తొందరగా కనెక్ట్ అవుతారు. ఆసక్తికరంగా చూస్తారు. కొన్ని యానిమేటెడ్ చిత్రాలు పిల్లలకు సరదాను పంచటంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఇలాంటి సినిమాలను పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా చూపించాలి. వేసవి సెలవులు వచ్చేయడంతో అందుకు ఇదే సరైన సమయం. యానిమేటెడ్ మూవీస్ కావటంతో పిల్లలు ఇష్టంగా చూడడంతో పాటు వారిలో ఆటోమేటిక్‍గా పాజిటివిటీ పెరుగుతుంది. అలా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచగలిగే 10 యానిమేషన్ సినిమాలు గురించి, ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

కుంగ్ ఫూ పాండా (2008) సరదాగా ఉండటంతో పాటు పిల్లల్లో తమపై తమకు నమ్మకాన్ని పెంచగలదు. ఈ చిత్రంలో తికమకగా ఉండే పాండా.. డ్రాగన్ వారియర్‌లా మారేందుకు చ...