Hyderabad, జనవరి 30 -- OTT Adventure Thriller: వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ మూవీ మోనా 2 (Moana 2). మోనా సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ రెండో మూవీ గతేడాది నవంబర్ 27న థియేటర్లలో రిలీజై ఏకంగా 102 కోట్ల డాలర్లు (సుమారు రూ.8800 కోట్లు) వసూలు చేసింది. ఇప్పుడీ మూవీ ఇండియాలో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే సినిమా చూడాలంటే మాత్రం రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.

150 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1300 కోట్లు) బడ్జెట్ తో రూపొందిన మూవీ మోనా 2. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే రూ.389 రెంట్ చెల్లిస్తేనే ఈ సినిమా చూసే అవకాశం ఉంటుంది. ఈ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ మూవీలో డ్వేన్ జాన్సన్, ఔలీ క్రావాలో, టెమూరా మోరిసన్, నికోల్ షెర్జింగర్, రేచెల్ హౌజ్ లాంటి వాళ...