Hyderabad, మార్చి 21 -- OTT Adventure Comedy Movie: ఆరేళ్లుగా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రాని ధనుష్ నటించిన అడ్వెంచర్ కామెడీ ఇంగ్లిష్ మూవీ.. మొత్తానికి డిజిటల్ ప్రీమియర్ కానుంది. 2019లో థియేటర్లలో రిలీజైనా.. ఇప్పటి వరకూ ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడీ సినిమాను తెలుగులో ఆహా వీడియో ఓటీటీ తీసుకురానుంది. శుక్రవారం (మార్చి 21) దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది.

ధనుష్ నటించి ఈ ఇంగ్లిష్ అడ్వెంచర్ కామెడీ మూవీ పేరు ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ఎ ఫకీర్. ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఆహా వీడియో ఓటీటీలో మార్చి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ శుక్రవారం (మార్చి 21) వెల్లడించింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఈ మూవీ 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయిన సినిమా ఇది. తమిళ...