భారతదేశం, ఫిబ్రవరి 1 -- మలయాళ మూవీ 'మార్కో' చాలా బజ్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 20న మలయాళం, హిందీలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయింది. మలయాళంలో భారీ కలెక్షన్లు దక్కించుకుంది. హిందీలోనూ బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. జనవరి 1న తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో.. మలయాళ మోస్ట్ వైలెంట్ మూవీగా పాపులర్ అయింది. బ్లాక్‍బస్టర్ సాధించింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయినా.. హిందీ ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది.

మార్కో సినిమాను జనవరి 14వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ ఓటీటీ వెల్లడించింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడల్లో స్ట్రీమింగ్‍కు తెస్తామని వెల్లడించింది. హిందీ వెర్షన్‍ను ప్రస్తావించలేదు. దీంతో మార్కో చిత్రం ...