Hyderabad, ఏప్రిల్ 7 -- OTT Action Thriller: ఓటీటీలోకి ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.773 కోట్లు కావడం విశేషం. అంత బడ్జెట్ పెట్టిన తీసిన మూవీ.. థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్ లోకి అడుగుపెడుతుండటం విశేషం. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్.. ఈ సినిమా స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.

నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతున్న ఆ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు హావోక్ (Havoc). ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఎప్పుడో నాలుగేళ్ల కిందటే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. మొత్తానికి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తోంది.

"పూర్తి విధ్వంసం జరగబోతోంది. హావోక్ ను కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే చూడండి" అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ సోమవారం (ఏప్రిల్ 7) ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి...