భారతదేశం, ఏప్రిల్ 9 -- బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన 'జువెల్ తీఫ్' చిత్రంపై బజ్ బాగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ మూవీకి కూకీ గులాటీ, రాబీ గెర్వాల్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమా క్యూరియాసిటీని పెంచింది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతుండగా.. జువెల్ తీఫ్ నుంచి పాటను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 9) తీసుకొచ్చింది.

జాదూ అంటూ జువెల్ తీఫ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. లిరికల్ వీడియోను యూట్యూబ్‍లో మూవీ టీమ్ రిలీజ్ చేసింది. క్యాచీ బీట్‍తో మంచి ఎనర్జీతో ఈ సాంగ్ ఉంది. సైఫ్ అలీ ఖాన్, నిఖితా దత్తా స్టెప్‍లు, కెమిస్ట్రీ ఆకట్టుకుంది. జైదీప్ అహ్లవత్ కూడా ఈ పాటలో చిందేశారు.

జూదూ పాటకు సవేపా, ఓఏఎఫ్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను రాఘవ్ చైతన్య పాడారు. కుమార్ లిరిక్స్ అందించారు. పియూష్...