భారతదేశం, ఫిబ్రవరి 9 -- మలయాళ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మోస్ట్ వైలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది. యానిమల్, కిల్ చిత్రాలకు మించి వైలెంట్‍గా ఉందంటూ టాక్ దక్కించుకుంది. మార్కో చిత్రం గతేడాది డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో రిలీజై కలెక్షన్లు దూకుడుగా రాబట్టింది. హిందీలోనూ రిలీజైంది. ఆ తర్వాత తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చి మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు మార్కో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ వారమే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

చాలా పాపులర్ అయిన మార్కో మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ థియేటర్ వెర్షన్‍లో లేని కొన్ని సీన్లు ఓటీటీలో ఉంటాయనే అంచనాలు ఉండటంతో మరింత ఆసక్తి నెలకొంది.

మార్కో చిత్రం ఫిబ్రవరి 14వ తేదీని సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍...