భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఓటీటీల్లో యాక్షన్ సినిమాలు చూడాలని అనుకుంటున్న వారికి తాజాగా మంచి ఆప్షన్లు వచ్చాయి. కొన్ని యాక్షన్ చిత్రాలు లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇందులో నాలుగు పాపులర్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు సినిమాలు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. లేటెస్ట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన నాలుగు యాక్షన్ సినిమాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి. చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

వైలెంట్ యాక్షన్ మూవీగా మార్కో చాలా పాపులర్ అయింది. ఈ సినిమా గత వారం ఫిబ్రవరి 14వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో చిత్రం డిసెంబర్ 20న మలయాళంలో రిలీజై బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఆ తర్వాత తెలుగులోనూ రిలీజైంది. ఈ మూవీని ఇంటెన్స్ యా...