భారతదేశం, మార్చి 29 -- OTT: ఫ్రీ ఫెస్ట్ పేరుతో ప్ర‌తి వీకెండ్ తెలుగు, త‌మిళ సినిమాల‌ను ఫ్రీగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుంటుంది స‌న్ నెక్స్ట్. ఎలాంటి రెంట‌ల్‌, స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఫ్రీ ఫెస్ట్ మూవీస్‌ను స‌న్ నెక్స్ట్‌లో చూడొచ్చు. ఈ వారం ఫ్రీ ఫెస్ట్‌లో భాగంగా తెలుగు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ రామ్ చ‌ర‌ణ్ ధృవ‌, నితిన్ ఇష్క్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మార్చి 28 నుంచి 30 వ‌ర‌కు మూడు రోజుల పాటు ధృవ‌, ఇష్క్ సినిమాల‌ను ఫ్రీగా ఓటీటీలో చూడొచ్చ‌ని స‌న్ నెక్స్ట్ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఈ సినిమాల పోస్ట‌ర్‌ల‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

2016లో రిలీజైన రామ్‌చ‌ర‌ణ్ ధృవ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ...