భారతదేశం, మార్చి 2 -- నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఆదివారం రివీలైంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. తండేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

తండేల్ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన ...