భారతదేశం, జనవరి 24 -- రిపబ్లిక్ డే సంబరాలకు దేశం సిద్ధమవుతోంది. జనవరి 26న ఇండియా మొత్తం ఈ జాతీయ పండగను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన ఈ 5 దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేయండి. లాంగ్ వీకెండ్ లో ఈ గూస్ బంప్స్ తెప్పించే మూవీస్ ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసేయండి.

అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో 2001లో వచ్చిన చారిత్రాత్మక స్పోర్ట్స్ డ్రామా లగాన్ మూవీ ఇండియాలో దేశభక్తి సినిమాలకు ఓ స్టాండర్డ్ క్రియేట్ చేసింది. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ప్రస్థానాన్ని ఈ సినిమా ప్రారంభించింది. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వాళ్లు విధించిన భారీ 'లగాన్' (పన్నులు)కు వ్యతిరేకంగా మొత్తం సమాజాన్ని ఏకం చేసిన ఒక గ్రామ యువకుడిగా ఆమిర్ ఖాన్ లగాన్ లో నటించారు.

పన్నును మాఫీ చేసే ఒప్పందంలో భాగంగా అనుభవజ్ఞులైన బ్రిటిష్ క్రికెట్ జట్టుతో తలపడేందుకు అతను ఒక క్రిక...