భారతదేశం, మార్చి 28 -- OTT:ఈ శుక్ర‌వారం (నేడు) నితిన్ రాబిన్‌హుడ్‌తో పాటు మ్యాడ్ 2 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు కామెడీ క‌థాంశాల‌తోనే తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. కాగా రాబిన్‌హుడ్‌తో పాటు మ్యాడ్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఫిక్స‌య్యాయి.

నితిన్ రాబిన్‌హుడ్ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను జీ5 ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాలుగు నుంచి ఐదు వారాల గ్యాప్ త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం. రాబిన్‌హుడ్ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించింది. కేతికా శ‌ర్మ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది.

రాబిన్‌హుడ్ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్‌కు నెగెటివ్ టాక్ వ‌చ్చింది. క‌థ‌ను కాకుండా కామెడీని న‌మ్మి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడంటూ నెట...