భారతదేశం, ఏప్రిల్ 1 -- లాల్ సలామ్ సినిమా డిజాస్టర్ అయినా ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి మాత్రం ఉంది. చాలా ఆలస్యమవుతుండటంతో అసలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇస్తుందా అనే డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రం గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి మాత్రం అడుగుపెట్టలేదు. అయితే, ఈ మూవీ స్ట్రీమింగ్‍పై మరోసారి తాజాగా బజ్ నెలకొంది.

లాల్ సలామ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దగ్గర ఉన్నాయి. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ కూడా రైట్స్ తీసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీ ఇప్పటి వరకు ఏ ఓటీటీలోకి కూడా రాలేదు. అయితే, ఈ వారంలోనే సన్‍ నెక్స్ట్ ఓటీటీలో లాల్ సలామ్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తాజాగా రూమర్లు బయటికి వస్తున్నాయి. సోషల్ మ...