భారతదేశం, ఫిబ్రవరి 10 -- తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్ర పోషించిన లాల్ సలామ్‍ సినిమా డిజాస్టర్ అయింది. తమిళ యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఈ స్పోర్ట్ డ్రామా మూవీలో లీడ్ రోల్స్ చేశారు. రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది 2024 ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చింది. లాల్ సలామ్‍ చిత్రం అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. ఈ మూవీకి రిలీజై ఇప్పటికి ఏడాది పూర్తయింది. అయితే, ఇంకా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు మాత్రం రాలేదు. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

లాల్ సలామ్‍ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు దక్కించుకున్నాయని ముందుగా సమాచారం వెల్లడైంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడు.. ఇప్పుడు అంటూ రూమర్లు చాలాసార్లు వచ్చాయి. మూవీ టీమ్ నుంచి కూడా హింట్స్ వచ...