భారతదేశం, జనవరి 29 -- OTT: ఓటీటీ ట్రెండ్ కార‌ణంగా మ‌ల‌యాళం, త‌మిళ సినిమాల‌కు క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఓటీటీల‌లో మ‌ల‌యాళం, త‌మిళ‌ సినిమాలు మిలియ‌న్ల‌లో వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కార‌ణంగానే ప‌లువురు మ‌ల‌యాళ‌, త‌మిళ ఆర్టిస్టులు తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల ఆడియెన్స్‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు.

త‌మిళ మ‌ల‌యాళ సినిమాలు ఎక్కువ‌గా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌, డిస్నీ హాట్ స్టార్‌ల‌లో స్ట్రీమింగ్ అవుతోంటాయి. ఇవే కాకుండా సోనీలీవ్‌, స‌న్ నెక్స్ట్స్ ఓటీటీల‌లో ఈ భాష‌ల‌కు చెందిన సినిమాల‌ను చూడొచ్చు. ఈ ఓటీటీల‌లో అన్ని భాష‌ల‌కు చెందిన సినిమాలు క‌నిపిస్తుంటాయి.

అలా కాకుండా కేవ‌లం మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల కోస‌మే ప్ర‌త్యేకంగా కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. త‌క్కువ స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీల‌తోనే అందుబాటులో ఉన్న ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్...