భారతదేశం, జనవరి 23 -- టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ ఓటీటీ సిరీస్ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు.

ఈ ఓటీటీ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్‌ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్‌లో సినిమాగా విడుదల చేయనున్నారు. కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మ...